Homeఆదాబ్ ప్రత్యేకంAyyappa Society | అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లు రావు..ఎన్ని ప్లోర్లైనా నిర్మించికోవచ్చా..?

Ayyappa Society | అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లు రావు..ఎన్ని ప్లోర్లైనా నిర్మించికోవచ్చా..?

  • ప్రభుత్వం చర్యలకు ఎందుకు వెనుకాడుతోంది..?
  • ఏ ఒక్క నిర్మాణానికి సరైన అనుమతులు లేవు
  • నియమ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు
  • అక్రమార్కులతో అంటగాగుతున్న కొందరు అధికారులు
  • సర్వే నెం. 11/18 నుంచి 11/44 వరకు అక్రమ నిర్మాణాలు
  • సీఎం రేవంత్ దృష్టి పెట్టాలంటున్న సామాజికవేత్తలు

మీకు డబ్బు, పలుకుబడి ఉంటేచాలు.. మీ ఇష్టం వచ్చినట్లుగా అక్రమ నిర్మాణాలు చేసుకోవచ్చు.. ఇక్కడ వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తులో పెను ప్రమాదం.. నీటి ఎద్దడితో ఇక్కడి ప్రజానీకం అల్లాడి పోవాల్సిన పరిస్థితి.. కళ్ళు చెదిరే వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న ఆదాబ్ హైదరాబాద్..

మీరు మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు.. కేవలం డబ్బు, పలుకుబడి ఉంటే చాలు.. మీకు నచ్చినట్లు, ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు.. దీనికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉన్నట్లుంది.. విశేషం ఏమిటంటే బిల్డింగ్ నిర్మాణానికి మీరు ఏ ఆఫీసు చుట్టూ తిరగనవసరం లేదు.. మున్సిపల్, ఎలక్ట్రిసిటీ తదితర డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులు మీదగ్గరకు వస్తారు.. దానికి సంబంధించి వారికి అమ్యామ్యాలు ముట్టజెపితే చాలు.. నిరభ్యంతరంగా మీకు నచ్చినట్లు, మీకు కావాల్సినన్ని అంతస్తులతో బిల్డింగ్ కట్టుకోవచ్చు.. ఆ తర్వాత మీ జోలికి ఎవరూ రారు.. ఉదాహరణకు సర్వే నెంబర్ 11/18 నుంచి 11/44 వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి..

- Advertisement -

కాగా మీరు నిర్మించే బిల్డింగ్ పూర్తవుతుంది అద్దెకు ఇచ్చుకొని లక్షలు సంపాదించవచ్చు.. లేదా అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చు.. ఇప్పటికీ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి.. అక్కడికి వెళ్లి చూస్తే అర్ధం అవుతుంది.. ఇక్కడ బిల్డింగ్స్ కి, కమర్షియల్ కట్టడాలకు ట్యాక్సులు వుండవు.. మీరు అమ్మేసుకున్నా, రెంట్ కి ఇచ్చుకున్నా అంతా బ్లాక్ మనీతోనే పనులన్నీ జరిగిపోతాయి.. నో వైట్ ఓన్లీ బ్లాక్.. ముఖ్యమంత్రి గారూ ఒకసారి మాదాపూర్ అయ్యప్పా సొసైటీపై దృష్టి సారించండి.. పరిశీలించండి.. అక్కడ వసూలయ్యే సొమ్ముతో మీ ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లు సమకూరుతాయి.. ఒక్కసారి ఆలోచించండి ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, పథకాలు అమలు చేయండి..

మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు లెక్కలేనన్ని వెలుస్తున్నాయి.. ఇక్కడి అక్రమ నిర్మాణాలపై పుంఖాను పుంఖాలుగా ఎప్పటికప్పుడు, ఆధారాలతో కథనాలను అందిస్తోంది ఆదాబ్ హైదరాబాద్.. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం దురదృష్టం.. వాస్తవానికి ఒక సామాన్యుడు తన కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే.. అధికారులు గద్దల్లా వాలిపోతారు.. ఆ పర్మిషన్ లేదు.. ఈ పేపర్ లేదు అంటూ నానా రకాలుగా వేధిస్తారు.. తమ మాట వినకపోతే ఆ ఇల్లును కూల్చివేస్తారు.. అదే పలుకుబడి వున్నవాళ్లు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండానే పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించినా.. వాటి జోలికి పోరు.. పైగా దగ్గరుండి మరీ ఆ నిర్మాణాలకు సహకరిస్తారు..

ప్రస్తుతం ఇదే పద్ధతి కొనసాగుతోంది.. ఇక మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు లెక్కేలేదు.. ఇక్కడ నిర్మాణాలు జరుపుకుంటున్న బిల్డింగులకు ఎలాంటి అనుమతులు ఉండవు.. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి.. ఫిర్యాదులు చేస్తే తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.. నిజానికి ఇక్కడ నిర్మాణం చేయాలంటే ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడని పరిస్థితి.. ఎందుకంటే అయ్యప్పా సొసైటీ వ్యవహయారం న్యాయస్థాన పరిథిలో వుంది..

ఒక వేల ఏదైనా పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే అనుమతుల కోసం ఒక్కో బిల్డింగ్ కి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ప్రభుత్వానికి (ఎల్.ఆర్.ఎస్., బీ.పీ.ఎస్.) చెల్లించాల్సి ఉంటుంది.. కాగా నిర్మాణ క్రమంలో మరి కొన్ని చెల్లింపులు తప్పనిసరి.. కానీ ఇక్కడ అసలు అనుమతులకు తావే లేదు.. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతోందో ఊహించవచ్చు.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో..? తెలియాల్సి వుంది..

ఇక ప్రభుత్వ పథకాలకు, పెన్షన్లకు, ఉద్యోగుల జీత, భత్యాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు, రైతులకు చెల్లించాల్సిన పైకం, విద్యార్థుల కోసం చెల్లించాల్సిన ఫీజు రీ యంబర్స్ మెంట్.. స్కాలర్ షిప్స్, అలాగే ప్రభుత్వ పథకాలకు, ప్రజోపయోగార్ధం ఖర్చు చెయ్యాల్సిన పైకం కోసం ప్రభుత్వం నిధులు లేవంటూ నానా యాతన పడుతోంది.. మరి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణదారుల నుంచి రావాల్సిన అమౌంట్ ను ఫైన్ తో సహా వసూలు చేస్తే వీటన్నిటికీ డబ్బు సమకూరుతుంది కదా..? మరి ఎందుకని ఆదిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అన్నది అంతుబట్టని విషయంగా మారింది..

పైగా అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో భూగర్భ నీటి నిలువలు చాలా తక్కువుగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.. మరి ఇలా ఇబ్బడి ముబ్బడిగా పెద్ద పెద్ద బిల్డింగుల నిర్మాణం జరిగితే ఆ ప్రాంతంలో నీటికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నది యదార్ధం.. అలాగే ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానినుంచి బయటపడే మార్గాలు కూడా కనిపించడం లేదు.. ఫైర్ యాక్సిడెంట్ లాంటివి సంభవిస్తే వేలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి.. ఇవన్నీ ప్రభుత్వాధి కారుల దృష్టికి రాలేదా..? ఒకవేళ వచ్చినా కొందరు అధికారులు లంచాలకు అలవాటుపడి చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా..? భయంకరమైన వాస్తవం ఏమిటంటే ఎలాంటి అనుమతులు లేకుండా..

పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తుంటే.. కళ్లున్న కబోదుల్లాగా అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు..? ఇది మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాలేదా..? వచ్చినా ఆయన పట్టించుకోవడం లేదా..? లేక కొందరు అధికారులు ఆయన వరకూ ఈ అక్రమ వ్యవహారాలు తీసుకుని పోవడం లేదా..? అన్నది ఇప్పుడు అనుమానాస్పదంగా కనిపి స్తోంది.. అసలే అప్పులతో కూరుకుపోయి, అభివృద్ధి కుంటు పడుతున్న సమయంలో అయ్యప్ప సొసైటీ, అక్రమ నిర్మాణ దారులనుంచి ఫైన్ తో సహా వసూలు చేయగలిగితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడపడానికి ప్రభుత్వానికి సాధ్యం అవుతుంది..

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేని స్కూళ్ళు, కాలేజీలు కూడా నడుస్తున్నాయి.. విద్యాసంస్థలు నడుస్తున్న బిల్డింగులకు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవు.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అసలే లేవు.. విద్యార్థులకు వసతులు మృగ్యంగా ఉన్నాయి.. ఈ బిల్డింగ్స్ లో ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల బ్రతుకులు బుగ్గిపాలు అవుతాయి.. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది..

అసలు అర్ధం కానీ విషయం ఏమిటంటే అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు అవసరం లేదా..? కేవలం డబ్బు, పరపతి ఉంటే చాలా..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఏదైనా జీవో జారీ చేశారా..? అన్నది అంతుబట్టని విషయంగా మారింది.. లేకపోతే హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు వర్తించే నియమ, నిబం ధనలు మాదాపూర్, అయ్యప్ప సొసైటీకి ఎందుకు వర్తించడం లేదు..?

అయ్యప్ప సొసైటీ తెలంగాణలో, హైదరాబాద్ కు సంబంధిన ప్రాంతమా..? లేక ఇతర ప్రాంతమా..? తేలాల్సి వుంది.. అసలీ ప్రాంతం భారత భూభా గానికి సంబంధిం చినదేనా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు పలువురు.. అయ్యప్ప సొసైటీలో జరుగు తున్న, జరిగిన అక్రమ నిర్మాణా లపై ఆధారాలతో సహా మేము ప్రభుత్వానికి నివేదిస్తాము.. వాటిమీద చర్యలు తీసుకుని, రాష్ట్రాన్ని అప్పుల ఊబినుంచి బయటపడేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందా..? అని ప్రశ్నిస్తున్నాం.. అధికారులకు తగిన ఆధారాలు అందిస్తాం.. ‘మరిన్ని సంచలన కథనాలను మీముందుకు తీసుకుని రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News