Sunday, June 14, 2026
Homeఅంతర్జాతీయంChina Visit | చైనా పర్యటనకు ట్రంప్..

China Visit | చైనా పర్యటనకు ట్రంప్..

  • జీ జిన్ పింగ్ ఆహ్వానం మేరకు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు..
  • వివరాలు వెల్లడించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ట్రంప్‌ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారు. ట్రంప్‌ తమ దేశ పర్యటనకు వస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ట్రంప్‌ అమెరికా అధ్యక్షుని హోదాలో చైనాకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ చివరిసారిగా తన తొలి టర్మ్‌లో 2017లో అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించారు.

ఇరాన్‌తో యుద్ధం, హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల్లో ట్రంప్‌ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం సాయంత్రానికల్లా ట్రంప్‌ బీజింగ్‌ చేరుకుంటారు. గురు, శుక్రవారాల్లో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News