- ఈ క్షిపణిని రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది
అత్యాధునిక టెక్నాలజీతో డీఆర్‌డీఓ రూపొందించిన రెండు ప్రళయ్ క్షిపణుల టెస్ట్`ఫైర్ విజయవంతమైనట్టు రక్షణ శాఖ బుధవారం నాడు తెలిపింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10.30 గంటలకు ఈ మిసైళ్లను ప్రయోగించారు. ఒకే లాంఛర్ నుంచి వరుసగా వీటిని ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది.
రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ ఈ క్షిపణని అభివృద్ధి చేసింది.ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది. మిసైల్ ఫ్లైట్ తుది దశ వెరిఫికేషన్ కూడా విజయవంతమైందని చెప్పింది.
- Advertisement -
