రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ఉపరాష్ట్రపతి(Vice President) సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan), ప్రధాని మోదీ(PM Modi), తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి(RevanthReddy), ప్రతిపక్ష నేతలు కేసీఆర్(KCR), వైఎస్ జగన్(YS Jagan).. దేశ విదేశాల్లోని భారతీయులకు, తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 అందరికీ అద్భుత సంవత్సరం కావాలని ఆకాంక్షించారు. సరికొత్త సంకల్పాలు తీసుకునేందుకు ఇదే మంచి సందర్భమని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అందరం పాటుపడదామని కోరారు. ఈ ఏడాది మనందరి జీవితాల్లో శాంతి, సంతోషం నిండాలని అన్నారు. నూతన సంవత్సరంలో అన్ని ప్రయత్నాలు సక్సెస్ కావాలని, ప్రతిఒక్కరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Happy New Year | ప్రముఖుల నూతన సంవత్సర శుభాకాంక్షలు
- Advertisement -
RELATED ARTICLES
