Homeహైదరాబాద్‌JubileeHills | బడుగుల ఐక్యత చాటాలి

JubileeHills | బడుగుల ఐక్యత చాటాలి

బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కే ఓటేయండి
కాంగ్రెస్ గెలుపుతోనే బీసీలకు రాజ్యాధికారం
జూబ్లీహిల్స్ ఓటర్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల లేఖ

11న మంగళవారం జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌(Naveen Yadav)కు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను కోరాయి. ఈ మేరకు బహిరంగ లేఖ (Open letter) రాశాయి. ఈ లేఖను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) హైదరాబాదులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల (Bc, sc, st, minority unions) నేతలతో కలిసి విడుదల చేశారు

- Advertisement -
WhatsApp Image 2025 11 09 at 20.27.32

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు శాసన సభలో 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. నవీన్ యాదవ్‌ను గెలిపించడం ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. మంత్రివర్గంలో బీసీ మంత్రుల సంఖ్యా పెరుగుతుంది. తద్వారా 2028 ఎన్నికల్లో బీసీలు రాజకీయాలను శాసిస్తారు.

ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ కుందారం గణేష్ చారి, ఎమ్మార్పీఎస్ నేతలు ఇటిక రాజు మాదిగ, మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, ఎస్టీ సంఘం నాయకులు తిరుమల కేశవ నాయుడు, బీసీ జాగృతి అధ్యక్షుడు కేపీ మురళి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్ పూసల, సర్పంచుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్, మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి, వివిధ సంఘాల నేతలు సురేందర్, భాస్కర్, శ్యామ్, మాదేశి రాజేందర్ గంగపుత్ర, వరికుప్పల మధు వడ్డెర, జాజుల లింగం, బండిగారి రాజు, బొల్లెపల్లి స్వామి గౌడ్, భాస్కర్ మేరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News