కరీంనగర్, నవంబర్ 11(ఆదాబ్ హైదరాబాద్):-
ఈ నెల 6,7 వ తేదీలలో రాష్ట విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని టి.జి.ఐ.ఆర్.డి. (తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ) , రాజేంద్రనగర్ లో జరిగిన రాష్టస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో స్థానిక నగరం లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల 9 వ తరగతి కి చెందిన యన్. ప్రమధ శ్రీ , యస్. శ్రీ సాన్విక , కె. శ్రీ వికాస్, కె. వైష్ణవి లు రాష్ట్రస్థాయి గాత్ర సంగీత పోటీల బృంద విభాగం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి పొంది, జాతీయస్థాయి కి ఎంపికై సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ రాజీవ్ , ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనాథ్ చేతులమీదుగా మెమొంటో, సర్టిఫికేట్స్ 5000/- రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు.
మంగళవారం జిల్లాపాలనాధికారి పమేలా సత్పత్తి స్థానిక కలెక్టర్ కార్యాలయం (collector office) లో జాతీయస్థాయి కి ఎంపికైన విద్యార్థులను సంగీత ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వినోద్ రావు, హన్మంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సంగీత ఉపాధ్యాయులు జితుమణి శర్మ, కిరణ్ లు పాల్గొన్నారు.
