HomeఫోటోలుBad Girlz | ‘బ్యాడ్ గర్ల్జ్’ మూవీ డిసెంబర్ 25న విడుదల

Bad Girlz | ‘బ్యాడ్ గర్ల్జ్’ మూవీ డిసెంబర్ 25న విడుదల

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టయినర్ చిత్రం ‘బ్యాడ్ గర్ల్జ్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్.

bad girlz3

శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగ (Christmas Festival) కానుకగా డిసెంబర్ 25న (December 25th) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. “మా ‘బ్యాడ్ గర్ల్జ్’ పూర్తి ఎంటర్‌టైనర్ చిత్రం. జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గర్ల్జ్’. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనుకుంటున్నా.

- Advertisement -
bad girlz4

అనూప్ రూబెన్స్ (Anoop Rubens) మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్రబోస్ (Chandrabose) అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగున్నాయి. ఇటీవల విడుదల అయిన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు మంచి ఆదరణ లభించింది. యూట్యూబ్‌లో 6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాగే ఇటీవల విడుదల అయిన బాడ్ గర్ల్జ్ టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదలవుతుంది తప్పక చూడండి” అని తెలిపారు.

bad girlz2
- Advertisement -
RELATED ARTICLES

Latest News