Sunday, April 19, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రక్తంతో రాసుకున్న పోరాటాన్ని తక్కువ చేయలేరు

Aaj Ki Baath | రక్తంతో రాసుకున్న పోరాటాన్ని తక్కువ చేయలేరు

తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్- పాకిస్తాన్ విభజనతో పోల్చడం-అమానవీయ-అనైతిక రాజకీయం. తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఆత్మగౌరవాన్ని గాయపరిచాయి. రక్తంతో రాసుకున్న పోరాటాన్ని రాజకీయ పోలికలతో తూచడం దుర్మార్గం.. తెలంగాణ కోసం యువత, విద్యార్థుల బలిదానాలతో సాధించిన రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడడానికి ఎంత ధైర్యం. రాజకీయ వ్యాఖ్య కాదు-భావోద్వేగాలపై దాడి. తెలంగాణ ఉద్యమం హక్కుల కోసం జరిగిన ప్రజా పోరాటం, స్వరాష్ట్ర నిర్మాణం. ప్రతి కన్నీటి చుక్కలో ఆత్మగౌరవ త్యాగం-బలిదానంలో గొప్పలక్ష్యం ఉంది.మరిచిపోయి మాట్లాడటం రాజకీయ అహంకారం.. పార్లమెంట్ గౌరవ వేదికపై మాటలకు మరింత బాధ్యత ఉండాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడం ప్రజాస్వామ్య ధర్మం. ఆత్మగౌరవ పోరాటం.. ఏ పోలికలతోనూ తగ్గేది కాదు.. ప్రపంచం హర్షించిన త్యాగాల చరిత్ర తస్మత్ జాగ్రత్త..!

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News