Wednesday, February 11, 2026
Homeబిజినెస్Sachin Tendulkar | టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా సచిన్

Sachin Tendulkar | టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా సచిన్

టెక్నో పెయింట్స్(Techno Paints) ప్రచారకర్త(Brand Ambassador)గా మాస్టర్ బ్లాస్టర్(Master Blaster) సచిన్ టెండుల్కర్‌ను నియమించారు. పెయింట్స్ తయారీ సంస్థ అయిన టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ మూడేళ్లు ఉంటారు. దేశీయ పెయింట్స్ రంగంలో పాతికేళ్లుగా కొనసాగుతున్న ఈ కంపెనీ ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ఈ మేరకు సచిన్‌ను ప్రచారకర్తగా ఎంచుకుంది. “ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ క్రికెటర్, భారతరత్న(Bharataratna) సచిన్ టెండూల్కర్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం” అని టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం విస్తరణ, IPO ద్వారా మరిన్ని గొప్ప విజయాలను సాధించాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘మాకు సచిన్‌ను మించిన మంచి ప్రచారకర్త లేదా వృద్ధి భాగస్వామి ఎవరూ లేరు’ అని తెలిపారు. ఈ సంస్థ 2023లో టాలీవుడ్ హీరో మహేష్ బాబు(Mahesh Babu)ను బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ చేసుకుంది. ఆయన రెండేళ్లపాటు ప్రచారకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News