Friday, March 6, 2026
Homeవరంగల్‌Sarpanch | పిడిసిల్ల సర్పంచిగా తాటిపాముల కవితను గెలిపించండి.

Sarpanch | పిడిసిల్ల సర్పంచిగా తాటిపాముల కవితను గెలిపించండి.

  • బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు.

మొగుల్లపెళ్లి మండలం పిడిసిల్ల సర్పంచ్ గా సిపిఐ బలపరిచిన బీసీ ముద్దుబిడ్డ తాటిపాముల కవిత శ్రీహరి ని సర్పంచ్ గా గెలిపించి బీసీల సత్తా చాటాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. పిడిసిల్లలో ప్రచార సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ గత, నేటి పాలకుల విధానాలతో 56% ఉన్న బీసీలకు అన్ని రంగాలలో తీరని అన్యాయమే జరిగిందన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 85 శాతం ఉన్న ప్రజలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు.

10 శాతం కూడా లేని ఆధిపత్య కులాలు అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనాన్ని చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కలిపిస్తామని నమ్మించి గొంతు కోసి 17 శాతం కూడా ఇవ్వకుండ అగ్రవర్ణాలకే పెద్ద పీట వేయడం దుర్మార్గమన్నారు. బీసీలకు ద్రోహం చేసిన పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన తాటిపాముల కవితను ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రసంగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారిని ఎన్నుకోవాలన్నారు.

- Advertisement -

కవిత మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపించి గ్రామ అభివృద్ధికి, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకొని సేవకురాలిగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి, సిపిఐ నాయకులు ప్రవీణ్ కుమార్, రాజయ్య, ఎండినబీ,
నిమ్మల రాజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News