Homeమహబూబ్‌నగర్‌Support | రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం.

Support | రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం.

  • బిజెపి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి.
  • జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ..

కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతులకు యూరియా సబ్సిడీ, పంట నష్టానికి పసల్ బీమా యోజన ఆర్థిక సహాయం అందిస్తూ రైతులకు అండగా ఉందని వనపర్తి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నారాయణ పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలకు 100 శాతం నిధులను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కొరకు మంజూరు చేస్తుందని తెలిపారు. ఉప్పరపల్లి గ్రామం అభివృద్ధి కొరకు సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన శశి బాబును గెలిపించాలని ఘనపూర్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Duppalli Narayana Highlights Central Governments Support to Farmers

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 15 వేలు రైతు భరోసా ఇస్తానని రైతులను మోసం చేసిందని ఆరోపించారు.6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, ఘనపూర్ ఇంచార్జ్ సీతారాములు, మండల అధ్యక్షులు బుచ్చిబాబు, మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, గిరిరాజు, యువమోర్చా నాయకులు రాజు, ఉప్పరపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News