Homeనిజామాబాద్‌Tadwai | ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి.

Tadwai | ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి.

  • ఎంపీడీవో భరత్ కుమార్.

తాడ్వాయి మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఉదయం 10 మధ్యాహ్నం 1 గంట వరకు వరకు జరిగే ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో భరత్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుందని ఈ ప్రజావాణిలో మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.

సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం లభిస్తుందని సాధారణ సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే పరిష్కారం చూపిస్తారని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమయానుకూలంగా హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News