Homeరంగారెడ్డిIgnite | విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం

Ignite | విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం

  • జె.ఎన్. టి.యూ.హెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి

విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని జె.ఎన్. టి.యూ.హెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మైసమ్మగూడ లోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2కే26 పేరుతో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు.

JNTUH Vice Chancellor At Ignite 2K26

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రతినిధులు ప్రదర్శనలను తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు వైపు దృష్టి సరించినప్పుడే నైపుణ్యం బయట పడుతుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించి ప్రత్యేకత కలిగి ఉంటే వాటికి పేటెంట్ హక్కులను పొంది అభివృద్ధి వైపు అడుగులు వేయవొచ్చని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నర్సింహా రెడ్డి,త్రిశూల్ రెడ్డి, తిలోక్ రెడ్డి, డైరెక్టర్ మోహన్,ప్రిన్సిపల్ లోకనాధం, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News