Tuesday, April 21, 2026
Homeనల్లగొండReservation | ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఎస్టీలకు కేటాయించాలి

Reservation | ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఎస్టీలకు కేటాయించాలి

  • బిఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సందీప్ నాయక్..

రానున్న ఎంపీపీ జడ్పిటిసి రిజర్వేషన్ కేటాయింపుల్లో గరిడేపల్లి మండలానికి ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఎస్టీ రిజర్వుడు కేటాయించాలని బిఆర్ఎస్ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గరిడేపల్లి మండలం ఏర్పడినప్పటి నుంచి ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఇప్పటిదాకా ఎస్టీలకు కేటాయించలేదని రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎలక్షన్లు ఈ రెండు స్థానాలను ఎస్టీలకు కేటాయించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంపీపీ, జడ్పిటిసి ఎలక్షన్లలో ఈసారి గరిడేపల్లి మండల స్థానాలను గిరిజనులకు కేటాయించాలని కోరారు. మండలంలో ఉన్న ఎస్సీ బీసీ అన్ని సామాజిక వర్గాల వారు ఈ పదవుల పొందారని, కేవలం గిరిజనులకు మాత్రమే ఎంపీపీ జడ్పిటిసి పదవులను రిజర్వేషన్ రాక ఇప్పటిదాకా అనుభవించలేకపోయారని కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయింపుల్లో జడ్పిటిసి, ఎంపీపీ రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించి గిరిజనులకు తగిన న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మలి దశ ఉద్యమకారులు గుగులోతు నీలా హేమ్లా నాయక్, బాలు నాయక్, నరేందర్ నాయక్, రవీందర్ నాయక్, రామన్ నాయక్, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News