Tuesday, April 21, 2026
Homeరంగారెడ్డిPrajavani | రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో..!

Prajavani | రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో..!

  • ప్రజావాణికి(48) ఫిర్యాదులు!!

కొంగరకలాన్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (48) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్న విస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

రెవెన్యూ శాఖ–08 , ఇతర శాఖలు -40 , మొత్తం 48 దరఖస్తులు అందాయి.

అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయకుండా ఉండకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి( రెవెన్యూ),జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News