Homeకరీంనగర్Environment | చిన్న వయసులోనే - పెద్ద ఆలోచన

Environment | చిన్న వయసులోనే – పెద్ద ఆలోచన

  • చిన్నారి శ్రీనికకు చెట్లపై పెద్ద మనసు
  • రోడ్డు విస్తరణలో చెట్లను కాపాడాలని ప్రజావాణిలో దరఖాస్తు

చెట్ల ప్రాధాన్యతను పాఠ్యపుస్తకాల్లో చదివి తెలుసుకున్న ఓ చిన్నారి.. వాటిని కాపాడేందుకు తన వంతు బాధ్యతగా ముందడుగు వేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తుమ్మనపెల్లి శ్రీనిక శ్రీ సరస్వతి విద్యాలయంలో రెండో తరగతి చదువుతోంది. ప్రతిరోజూ తండ్రి తుమ్మనపెల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తూ మార్గమధ్యంలోని ప్రకృతి,(Environment) చెట్లను ఆసక్తిగా గమనిస్తుండేది.

ఇటీవల నిజామాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించనున్నట్లు టీవీలో తెలుసుకున్న శ్రీనిక.. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను తన పాఠ్యపుస్తకాలలో చదివిన విషయాన్ని గుర్తుచేసుకుంది. దశాబ్దాలుగా పెరిగిన చెట్లను తొలగిస్తే విలువైన ప్రకృతి(Environment) సంపదను కోల్పోతామని భావించి, వాటిని సాధ్యమైనంత వరకు రక్షించాలని నిర్ణయించుకుంది.

- Advertisement -

ఈ క్రమంలో తన తండ్రి తుమ్మనపెల్లి వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చెట్లను పునఃస్థాపించి, సంరక్షించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు సమర్పించింది.

Srinika Appeals to Save Trees in Jagtial

ఈ సందర్భంగా శ్రీనిక మాట్లాడుతూ.. దశాబ్దాల వయస్సు కలిగిన చెట్లను తొలగిస్తే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటినా అవి మళ్లీ అదే స్థాయికి ఎదగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని తెలిపింది. ఉన్న చెట్లను కాపాడుకోవడం ద్వారా ప్రకృతి సంపదతో పాటు పర్యావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని సంరక్షించవచ్చని పేర్కొంది. ప్రతి ఒక్కరూ చెట్ల పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చింది.

చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో ముందుకొచ్చిన శ్రీనికను పాఠశాల అధ్యాపకులు, యాజమాన్య బృందం, పలువురు పెద్దలు అభినందించారు. చిన్నారి చేసిన ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News