సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ(North Telangana) ప్రజల కోసం ప్రత్యేక రైళ్ల(Special Trains)ను ప్రవేశపెట్టారు. ఇవి ఈ నెల 9, 10, 18 తేదీల్లో 4 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విషయాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే(Sirpur MLA) డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Palvai Harish Babu) ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్-కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని ఆయన గత నెలలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) జనరల్ మేనేజర్‌కి వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయం తీసుకుందని చెప్పారు. స్థానిక ప్రజలు ఈ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్, కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.


