Friday, November 14, 2025
ePaper
Homeఅంతర్జాతీయంShutdown Effect | అగ్రరాజ్యానికి రూ.62 వేల కోట్ల నష్టం

Shutdown Effect | అగ్రరాజ్యానికి రూ.62 వేల కోట్ల నష్టం

ఆర్థిక వ్యవస్థ మూసివేత (షట్‌డౌన్: Shutdown) వల్ల అమెరికా(America) రూ.62,149 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (Congressional Budget Office) తెలిపింది. ముఖ్యమైన బిల్లుల (Bills) విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో అమెరికా సర్కారు షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. 31 రోజులుగా ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. ఇదే కొనసాగితే ఆరు వారాల వ్యవధిలో 11 బిలియన్ డాలర్లు, 8 వారాల వ్యవధిలో 14 బిలియన్ డాలర్ల మేర నష్టం జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికా గవర్నమెంట్ గత 45 ఏళ్లలో మొత్తం 15 సార్లు మూతపడింది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలిసారి అధ్యక్షుడి(President)గా ఉన్నప్పుడు (2018-19లో) సుమారు 35 రోజులు మూతపడింది. ఇదే ఇప్పటివరకు సుదీర్ఘమైన షట్‌డౌన్. ఈ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News