Homeహైదరాబాద్‌Shirdi Sai | షిరిడి సాయిబాబ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

Shirdi Sai | షిరిడి సాయిబాబ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • షిరిడి సాయిబాబా ఐక్యవేదిక.

షిరిడి సాయిబాబాపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని షిరిడి సాయిబాబా ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షుడు మంచికంటి ధనంజయ, కార్యదర్శి పి.వి. సాయి మాట్లాడుతూ… ఇటీవలి కాలంలో కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య, ఆధారరహిత ప్రచారాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకారులు మైనంపాటి ప్రసాదు, గుండా మల్లయ్య, సాయి శ్రీనివాస్లు మాట్లాడుతూ… సాయిబాబాపై అబద్ధపు ప్రచారాలు చేసి సమాజంలో కల్లోలం సృష్టిస్తూ కొందరు యూట్యూబ్ వీడియోల ద్వారా లాభాలు పొందుతున్నారని విమర్శించారు.

Shirdi Sai Baba Forum Condemns Social Media Propaganda

ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు.

- Advertisement -

షిరిడి సాయిబాబా సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, దీనిని సహించలేని కొందరు స్వార్థపరులు చేస్తున్న ఆరోపణలను భక్త సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు ఖజాంచి గుండా మల్లయ్య, సాయిబాబా శ్రావణ్ కుమార్, ప్రసాద్ రావు, హనుమంతు, శ్రీదేవి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News