Homeనిజామాబాద్‌Buffaloes Theft | సంగోజి వాడిలో ఆరు గేదెల దొంగతనం.

Buffaloes Theft | సంగోజి వాడిలో ఆరు గేదెల దొంగతనం.

తాడ్వాయి మండలంలోని సంగోజీ వాడి గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన 6 గేదెలను దొంగతనం(buffaloes Theft) చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సంగోజివాడి గ్రామానికి చెందిన, గైని రాజు 2, లక్ష్మి 2, కమలాకర్ 2, చెందిన గేదెలను, అదే గ్రామానికి చెందిన బొంబాయి సంతోష్, పడమటి రమేష్,లు దొంగతనంగా వాటిని కొట్టాల నుండి కొట్టుకపోయినట్లు అమ్మడానికి ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు . బాధితులు తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన కొన్ని గేదలు మిస్ అయినట్లు వాటిని కూడ వీళ్ళే దొంగతనం చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి ఎస్సై నరేష్ తన సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలు తేలాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News