Wednesday, November 12, 2025
ePaper
HomeతెలంగాణSajjanar | వికలాంగుల భద్రతకు సిటీ పోలీస్ ప్రాధాన్యం ఇస్తుంది: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

Sajjanar | వికలాంగుల భద్రతకు సిటీ పోలీస్ ప్రాధాన్యం ఇస్తుంది: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే సందర్భంగా బుధవారం నిర్వహించిన సేఫ్టీ వాక్‌లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్(Hyderabad CP VC Sajjanar) ఐపీఎస్ పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయం నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరకు వాక్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సజ్జనర్ మాట్లాడుతూ.. అంధుల హక్కులు, భద్రత, స్వావలంబనపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 15న ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే(International White Cane Day) ను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. వైట్ కేన్ కేవలం ఒక కర్ర కాదని, అది అంధుల స్వతంత్రతకు, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకని అన్నారు.

హైదరాబాదు సిటీ పోలీస్ ప్రజల భద్రతలో భాగంగా వికలాంగుల(disabled) భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు పాదచారుల భద్రత, ముఖ్యంగా విజువల్ ఇంపెయర్డ్ పర్సన్స్ సురక్షితంగా రోడ్డు దాటేందుకు సహాయం చేయడంపై దృష్టి పెడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిసబుల్డ్(ఫెడ్) ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News