Homeఅంతర్జాతీయంVladimir Putin | రేపు ఇండియాకి రానున్న రష్యా అధ్యక్షుడు

Vladimir Putin | రేపు ఇండియాకి రానున్న రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్.. డిసెంబర్ 4, 5 తేదీల్లో (గురువారం, శుక్రవారం) ఇండియా(India)లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ(PM Modi)తో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం(Trade), రక్షణ(Defence) రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికా (America)తో ఇండియా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు మన దేశానికి వస్తుండటం ప్రాధాన్యత నెలకొంది.

ఇండియా, రష్యా, చైనా(Chaina) బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతామని పుతిన్ పేర్కొన్నారు. గడచిన మూడేళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం తదితర రంగాల్లో ఇప్పటికే ఈ దేశాల మధ్య భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇండియా పర్యటనలో ఆర్థిక అంశాలపైనా చర్చిస్తానని పుతిన్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News