Thursday, April 23, 2026
HomeతెలంగాణRTC Protest | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

RTC Protest | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

  • నర్సంపేటలో సంఘటన..
  • డ్రైవర్ పరిస్థితి సీరియస్..

ఆర్టీసీ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌ జిల్లా న‌ర్సంపేట‌లో ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా గురువారం న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స‌హ‌చ‌ర కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసి తీవ్రంగా గాయపడ్డ డ్రైవ‌ర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News