Homeతెలంగాణమజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

  • లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ జిమ్‌కాన, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మ్యాన్‌ గడ్డం వెంకటేశ్‌ గౌడ్‌ చేయూత

ఏదైనా అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చి ఆదుకుంటేనే మనిషి జీవితం సార్థకమవుతుందని భావించారు. అందుకు బృందంగా ఏర్పడి వివిధ సహాయ, సహకార కార్యక్రమాలు చేపడుతున్నారు. దైనందిన జీవనంలో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ సేవకు సమయం కేటాయిస్తూ తమ ఔదార్యాన్ని చాటుతున్నారు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు. అబ్ధుల్లాపూర్‌మెట్టు మండలంలోని మజీద్‌పూర్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సికింద్రాబాద్‌ లయన్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై-బెల్టులు, ప్రథమ చికిత్స పరికరాలు , బొమ్మలు, ఆఫీస్‌ ఛైర్స్‌ పంపిణీ చేశారు. ఇండియన్‌ ఆర్మీలో తన సేవలను అందించి పదవి విరమణ పొందిన గడ్డం వెంకటేశ్‌ తన గ్రామ స్కూల్‌కి ఏదైనా సహాయం అందించాలన్న మంచి ఉద్దేశంతో కూల్, హాట్ వాటర్ ఫిల్టర్‌ని అందించి దాతృత్వం చాటుకున్నారు.

Retired Indian Army Venkatesh Goud support for Majeedpur Government School 1

లయన్స్‌ క్లబ్‌ సభ్యులకు, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మ్యాన్‌ గడ్డం వెంకటేశ్‌ గౌడ్‌ గార్లకి టీచర్లు, గ్రామస్థులు, తల్లిదండ్రులు సన్మానించారు. స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ వి.కృష్ణ ప్రసాద్‌ విచ్చేసి అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ జయదేవరావు, సీనియర్‌ సభ్యుడు ఆర్‌ వి రాజు, కృష్ణారెడ్డి, హెచ్‌ఎం వి.విజయ్‌ భాస్కర్‌రెడ్డి, మహెష్‌, గడ్డం వెంకటేశ్‌, మేడిపల్లి నర్సింహా(జర్నలిస్ట్‌), జి.బాలయ్య గౌడ్‌, యం. కరుణాకర్‌, అనిల్‌, శ్రీశైలం, తల్లిదండ్రులు తాళ్ల వెంకటేష్‌, ఎడ్ల మహెందర్‌, విద్యార్థులు, టీచర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News