Friday, November 14, 2025
ePaper
HomeఫోటోలుFinale | ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు స్పెషల్ గెస్ట్‌గా రవితేజ

Finale | ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు స్పెషల్ గెస్ట్‌గా రవితేజ

సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజ రవితేజ స్పెషల్ గెస్ట్ గా హాజరవడం విశేషం. ఎనర్జీ, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో బృంద విజేతగా నిలిచింది. పవన్ కల్యాణ్ రన్నరప్ గా నిలిచారు. జడ్జిలుగా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి తెలుగు ఇండియన్ ఐడల్’ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్ ట్రోఫీని బృందాకు అందజేశారు.

తెలుగు ఇండియన్ ఐడల్’ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన బృంద తన నెక్ట్ మూవీలో పాట పాడుతుందని ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనౌన్స్ చేశారు. సింగర్ గా బృంద కెరీర్ ఆరంభంలోనే ఇదొక బిగ్ స్టెప్ కానుంది. తెలుగు మ్యూజిక్ టాలెంట్ కు గుర్తింపు తీసుకురావడంలో తెలుగు ఇండియన్ ఐడల్’ షో గొప్ప కృషి చేస్తోంది. గత నాలుగు సీజన్స్ గా ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిందీ షో.

RELATED ARTICLES
- Advertisment -

Latest News