- పదేళ్లుగా డైరెక్టర్ పదవిలో తిష్ట వేసిన ప్రొఫెసర్ కేశవులు
- నిబంధనలకు విరుద్ధంగా అగ్రివర్సిటీ నుండి డిప్యూటేషన్
- డిప్యూటేషన్పై వీసీలు లెటర్లు రాసినా పట్టించుకోని సర్కార్
- కోట్ల రూపాయల రెవెన్యూ, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం
- అక్రమాలపై విజిలెన్స్ విచారణకు యోచిస్తున్న ప్రభుత్వం
- పూర్తి ప్రక్షాళన చేయాలని భావిస్తున్న మంత్రి తుమ్మల
- రాజకీయ రంగును పులుముకున్న విత్తన ధృవీకరణ సంస్థ
రాష్ట్రంలోని విత్తన ధృవీకరణ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. ఇదే కాకుండా కొందరి మేధావులకు పునరావాసంగా కూడా ఏర్పడింది. సంస్థను కాపాడాల్సిన వారే.. కంచె చేనును మేసినట్టుగా దొరికినకాడికి దండుకుంటున్నారు. డిప్యూటేషన్పై వచ్చిన వారు సైతం విత్తన ధృవీకరణ సంస్థలో తిష్ట వేసి, కదలని పరిస్థితి ఏర్పడింది. డిప్యూటేషన్ నిబంధనలకు సైతం విరుద్ధంగా దశాబ్దకాలంగా కొనసాగుతున్నారంటే ఏ విధమైన ఆదాయం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పాఠాలు బోధించకుండా.. పైరవీలతో డైరెక్టర్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం(2015)లో ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ సీడ్ టెక్నాలజీ విభాగం నుంచి డిప్యూటేషన్పై ప్రొఫెసర్ కేశవులు విత్తన ధృవీకరణ సంస్థలో డైరెక్టర్గా వచ్చారు. వీరి నిర్వాకంతో స్వయం ప్రతిపత్తిగా ఉండాల్సిన సంస్థకు రాజకీయ రంగును పులుముకుంది. ఇదే కాకుండా 2 లక్షల ఎకరాలుగా ఉన్న విత్తన ధృవీకరణ విస్తీర్ణం ఏకంగా లక్ష ఎకరాలకు పడిపోయింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఐదేళ్లకు మించి డిప్యుటేషన్ పై వెళ్లకూడదు. కానీ, గత ప్రభుత్వంలో భారీగా ముడుపులు పుచ్చుకొని, అక్రమ జీవోలు తెచ్చుకొని, మరో 5 సంవత్సరాలు విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ గా కొనసాగారు. నిబంధలకు విరుద్ధంగా కొనసాగుతున్నారని నాటి వైస్ ఛాన్స్ లర్ డా.వి. ప్రవీణ్ రావు, ప్రస్తుత వైస్ ఛాన్స్ లర్ డా.ఎ.జానయ్య పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రొఫెసర్ స్థానం వదిలి డైరెక్టర్ చేరడంతో పాఠాలు బోధించకపోవడంతో విద్యా ర్థులకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కేశవులు, కావాల్సిన వారికి ముడు పులను ముట్ట చెప్తూ దశాబ్ధకాలంగా కొనసాగుతూ వస్తున్నారు.

సీడ్స్ కార్పొరేషన్ ఎండీ పదవి నుండి సస్పెండ్…
విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ గా, సీడ్స్ కార్పొరేషన్ ఎండి ఇంచార్జీగా పదేళ్ళు జోడు పదవుల్లో కేశవులు కొనసాగారు. ఆయా సంస్థలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కోట్ల రూపాయల రెవెన్యూ, ప్రభుత్వ నిధులు విచ్చల విడిగా ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డాడు. సీడ్స్ కార్పొరేషన్ లాంటి సంస్థను భ్రష్టు పట్టించి నష్టాల్లోకి నెట్టేశాడని మంత్రి తుమ్మల ఆదేశాలతో ఎండి పదవీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ, ఐఎస్టి టిఏ అనే పదవిని అడ్డు చూపి, సస్పెండ్ అయిన అధికారిని విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ గా కొనసాగించడంలో వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నత అధికారి అప్పట్లో చక్రం తిప్పి, ఏకంగా మంత్రి తుమ్మలను పక్కదోవ పట్టించారు. తన పదవీని కాపాడుకోవటం కోసం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, రాజకీయ నాయకులను బుట్టలో వేసుకొని పబ్బం గడిపాడు.
ఏజీ ఆడిటింగ్ తో అక్రమాలు బహిర్గతం…
ఇన్నాళ్ళు విత్తన ధృవీకరణ సంస్థను ప్రైవేటు ఆడిటింగ్ చేయించుకొని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకున్నారు. కానీ, గవర్నమెంట్ ఏజ్ ఆడిటింగ్ ఎంట్రీతో అక్రమాలు, అవకత వకలు ఒక్కొక్కటిగా బయటకు పొక్కి ప్రసార మాధ్యమాల ద్వారా బహిర్గతం అయ్యాయి. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి 25 దేశా లకు, 42 సార్లు టూర్లకు వెళ్లాడని, రాజకీయ నాయకుల మీటింగ్ లకు ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేశారని, సరైన లెక్కా పత్రం లేకుండా రూ.20 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్విని యోగం చేశాడని, అవసరం లేకున్నా బిల్డింగుల నిర్మాణం చేపట్టా రని, సంస్థకు సంబంధం లేని బయటి వ్యక్తులకు జీతాలు చెల్లిం చారని, లక్షలు ఖర్చు పెట్టి స్టార్ హోటళ్ళల్లో మీటింగ్ లు, మందు పార్టీలు కండక్ట్ చేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు కోట్ల రూపా యలను చెల్లించారని ఏజీ ఆడిటింగ్ లో బహిర్గతం అయ్యాయి.
విజిలెన్స్ విచారణకు యోచన..?
విత్తన ధృవీకరణ సంస్థను పూర్తి ప్రక్షాళన చేయాలని మంత్రి తుమ్మల భావిస్తున్నారు. ఈ సంస్థకు కొత్త డైరెక్టర్ను ఇప్పటికే వ్యవసాయ యూనివర్సిటీ నుంచి ఇద్దరు, నియమించేందుకు సైతం కార్యాచరణ మొదలైంది. DS అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఒకరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ, మంచి అనుభవం కలిగిన సీనియర్ అధికారికే బాధ్యతలు అప్పగిం చాలని తుమ్మల ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా, పదేళ్ళల్లో ఈ అధికారి చేసిన అవకతవలపై విజిలెన్స్ విచారణకు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 30 తో కేశవులు పదవీకాలం ముగియనుంది.
సెక్రటరీ మార్పుతో ఎపిసోడ్కు ఫుల్ స్టాఫ్ ?
డైరెక్టర్ పదవి నుంచి ప్రొ. కేశవులును తొలగించాలని ఫైల్ కదిలింది. ఈ విషయం తెలియగానే సెక్రటేరియట్ చుట్టూ సదరు అధికారి చక్కర్లు కొడుతూ, మంత్రుల పేషీల వద్ద పడి గాపులు కాస్తున్నాడు. ఇన్నాళ్లు వ్యవసాయ శాఖ ఉన్నత హోదా లో ఉండి తనను కాపాడిన గురువు, ఇటీవల జరిగిన ఐఏఎస్ల బదిలీలలో వ్యవసాయ శాఖ నుంచి బదిలీ అయ్యారు. దీంతో అయోమయంలో పడి, తన పైరవీకారుల ద్వారా మంత్రి తుమ్మ లపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వ్యవ సాయ సెక్రటరీగా బాధ్యతలు చేప్పట్టిన కె.సురేంద్ర మోహన్ ఇకనైనా ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాఫ్ పెడతారెమో వేచి చూడాల్సిందే.
