కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారి వివరణ
ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో(Viral Video)పై నిందిత కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారి(DGP-Civil Rights Enforcement) రామచంద్రరావు(RamachandraRao) వివరణ ఇచ్చారు. అది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence)తో సృష్టించిన వీడియో అని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తన ప్రత్యర్థులే ఆ వీడియోకి మూలకారకులని, వారే వైరల్ చేశారని ఆరోపించారు. ఈ ఉదంతంపై వివరణ ఇచ్చేందుకు హోం మంత్రి(Home Minister) డాక్టర్ జి.పరమేశ్వర(Dr.G.Parameshwara) ఇంటికి వెళ్లిన ఆయనకి అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మంత్రిని కలవకుండానే వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవాళ వైరల్ అయిన 47 సెకన్ల వీడియో ఐదేళ్ల కిందటిదని సమాచారం. అప్పట్లో రామచంద్రరావు బెళగావి ఐజీపీ పనిచేస్తున్నారు. ఆఫీసులో యూనిఫామ్‌లోనే ఉండి ఇద్దరు మహిళలతో చాలా సన్నిహితంగా మెలిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒక మహిళను ఆయన దగ్గరకు తీసుకొని హత్తుకోగా మరో మహిళను ముద్దుపెట్టుకున్నారు. ఈ ఉదంతంపై సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ నివేదిక వచ్చాక నిందితుడి హోదాతో సంబంధం లేకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అయితే రామచంద్రరావు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు చేసి నిజానిజాలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రరావు.. నటి రన్యారావుకి మారుతండ్రిగా గతేడాది వార్తల్లో నిలిచారు. ఆమెను గ్లోల్డ్ స్మిగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. రన్యారావు ఇప్పుడు బెంగళూరు సెంట్రల్‌లో ఉన్నారు.
