Tuesday, November 11, 2025
ePaper
HomeజాతీయంTribute | అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్

Tribute | అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్

  • పటేల్ దేశాన్ని ఏకం చేశారు : పీఎం మోడీ
  • కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది
  • ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది.
  • మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది
  • ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి..
  • పటేల్ జయంతి : సందర్భంగా ఏక్తా దివస్ ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు
  • ఆకట్టుకున్న సైనిక దళాల కవాతు

చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టిం చాలని సర్దార్ వల్లభ్బయ్ పటేల్ విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేశారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకంచేసి ఆయన చరిత్ర సృష్టించారని మోడీ కొనియాడారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత 550 సంస్థానా లను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు.

ఆయనకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైంది. దానిని మేం సమర్థిస్తాం అని అన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ ను జరుపుకొంటున్నాం. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. విభజన శక్తులకు దూరంగా ఉండాలి. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమిం చింది.

నక్సల్స్ ఏరివేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం. నక్సలిజం మూలాలను సమూలంగా పెకిలిస్తాం. కశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు. దానిని నెహ్రూ గౌరవించ లేదు. పటేల్, అంబేడ్కర్ను కాంగ్రెస్ అవమానించింది. ఆయన దూరదృష్టిని మరిచిపోయిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది.

మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహించాం. ఆయన ఆకాంక్షలను మేం గౌరవించాం. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుం టుంటే కొందరికి బాధగా ఉంటుంది. దేశం నుంచి చొరబాటు దారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం అని మోదీ పిలుపుని చ్చారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని వెల్లడించారు. పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివసన్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటుచేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టు కుంది. బిన్నత్వంలో ఏకత్వం థీమ్తో శకటాల ప్రదర్శన జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News