న్యూ ఇయర్-2026 వేడుకల సందర్భంగా మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఫామ్ హౌస్ యజమానులు మరియు ఈవెంట్ నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఫామ్ హౌస్‌లను అద్దెకు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా పోలీస్, ఫైర్, ట్రాఫిక్, ఎక్సైజ్ అనుమతులు పొందాలనే, శబ్ద కాలుష్యం నియంత్రణ, అగ్నిమాపక భద్రత, సీసీటీవీ నిఘా, సెక్యూరిటీ ఏర్పాట్లు కలిగి ఉండాలని తెలియజేశారు. అదే విధంగా, డీజే వాడకానికి అనుమతి లేదని కాబట్టి డీజే వాడకమూ చేయరాదని, మైనర్లు, అక్రమ మద్యం, డ్రగ్స్, హుక్కా వంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు పోలీసుల సూచనలు:
- ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడానికి ముందు అన్ని అనుమతులు ఉన్నాయో తనిఖీ చేయాలి.
- అనుమతించిన సామర్థ్యానికి మించి ఈవెంట్లు నిర్వహించరాదు.
- డ్రంక్ & డ్రైవ్ చేయరాదు; వాహనం నడుపుతున్నప్పుడు మద్యం సేవించరాదు.
- శబ్ద కాలుష్య నియమాలను పాటించాలి.
- డీజే వాడకానికి అనుమతి లేనందున ఎవరూ వాడరాదు.
- ఫైర్ క్రాకర్స్, ఓపెన్ ఫ్లేమ్స్ వాడరాదు.
- ఏమైనా అక్రమ కార్యకలాపాలు గమనించినా వెంటనే కీసర పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
- స్వయం రక్షణ కోసం స్నేహితులు/కుటుంబంతో వెళ్లడం మంచిది; మైనర్లను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చేర్చాలి.
- అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక, వైద్య సిబ్బంది, అత్యవసర నంబర్లను గుర్తుంచుకోవాలి.
- ప్రజల భద్రత, శాంతిభద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖకు అందరూ సహకరించాలి.
- Advertisement -
