Homeవరంగల్‌CMs Cup | పర్వతగిరి మండల స్థాయి సీఎం కప్ పోటీలు

CMs Cup | పర్వతగిరి మండల స్థాయి సీఎం కప్ పోటీలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల స్థాయి సీఎం కప్ క్రీడలను రేపు అనగా బుధవారం (04-02-2026) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని పర్వతగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.శంకర్ నాయక్ తెలిపారు. సీఎం కప్ క్రీడల నిర్వహణపై మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ కోకో వాలీబాల్ అథ్లెటిక్స్ యోగా ఫుట్బాల్ కరాటే చెస్ పోటీలలో ఎంపికలు జరుగునని తెలిపారు.

Parvathagiri Mandal CM Cup Sports Competitions 20261

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్, మండల్ ఎంట్రీ ఫామ్ లతో పర్వతగిరి ఉన్నత పాఠశాలలో హాజరు కావలసిందిగా తెలిపారు. కబడ్డీ క్రీడలకు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు అని వాలీబాల్, కోకో క్రీడలలో 18 సంవత్సరాల లోపు బాల బాలికలు పాల్గొనవచ్చు అని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలి అన్నారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి ఏ.బిక్షపతి, ఆర్.ఐ భారతి, ఎస్సై ప్రవీణ్, ఎం.పి.డీ.ఓ ఆఫీస్ సూపరెండెంట్ రూపేష్ కుమార్, పీడీ లు పి. అనిల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News