Homeఆదాబ్ ప్రత్యేకంIrregularities | ఉస్మానియాలో దశాబ్దాల ‘తిష్ట’!

Irregularities | ఉస్మానియాలో దశాబ్దాల ‘తిష్ట’!

ఆర్టీఐతో బట్టబయలైన తిష్టరాయుళ్లు

  • ప్రొఫెసర్లుగా 25, 20, 19 ఏళ్ల సుదీర్ఘ కొనసాగింపు
  • ఒక ఉద్యోగి 36 ఏళ్లుగా.. మరొకరు 32 ఏళ్లుగా!
  • ల్యాబ్ టెక్నీషియన్లలోనూ దీర్ఘకాలికం
  • ఆసుపత్రి పరిపాలనలో పారదర్శకతపై ప్రశ్నలు
  • ఆర్టీఐ రికార్డుల ఆధారంగా విచారణకు డిమాండ్
  • వైద్య ఆరోగ్య శాఖ, డీఎంఈ తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలోని ప్రతి ష్టాత్మకమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో పరిపాలనా వైఫ ల్యాలు, పడకేసిన పర్యవేక్షణ మరియు అత్యంత దారుణమైన అక్రమాలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే చోట నిర్దిష్ట కాలం మాత్రమే పనిచేయాల్సి ఉండగా, కొందరు స్వార్థపరులైన ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పాతుకుపోయి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నట్లు తాజాగా వెలుగు చూసిన సమాచార హక్కు చట్టం దస్త్రాల ద్వారా బట్టబయలైంది.

- Advertisement -

ఆర్టీఐ దస్త్రాల ద్వారా వెలుగు చూసిన విస్తుపోయే నిజాలు:

ప్రొఫెసర్లు మరియు వైద్యుల సుదీర్ఘ కాలం తిష్ట: ఈ-1 సెక్షన్ సమాచారం ప్రకారం, ఉస్మానియా హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్లలో డా. మనిషా సహాయ్ ఏకంగా 25 సంవత్సరాలు, డా. కిరణ్మయి ఇస్మాయిల్ 20 సంవత్సరాలు, డా. సి.హెచ్. మధుసూదన్ 19 సంవత్సరాలు పాటు ఒకే ఆసుపత్రిలో ప్రొఫెసర్లుగా కొనసాగుతుండటం ప్రభుత్వ వైద్య విద్యాశాఖ నిబంధనలను అపహాస్యం చేయడమే అవుతోంది. ఇటువంటి అనధికారిక కొనసాగింపులు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి నిదర్శనమనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఫార్మసీ సిబ్బంది వివరాలు (ఐడీ నెంబర్లతో సహా): ఈ-5 సెక్షన్ రికార్డుల ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ సిబ్బంది చాలా కాలంగా ఒకేచోట తిష్ట వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.

శ్రీనివాస్ (ఐడీ: 1727755, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1) – 6 సంవత్సరాల 3 నెలల 13 రోజులు
ఎ. మునికుమార్ (ఐడీ: 1732624, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1) – 5 సంవత్సరాల 20 రోజులు
ఎం. కృష్ణయ్య (ఐడీ: 1434123, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1) – 5 సంవత్సరాల 27 రోజులు
ఎన్. అరుణ కుమారి (ఐడీ: 4511145, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 1 సంవత్సరం 3 నెలల 26 రోజులు
ఎం. అపర్ణ (ఐడీ: 4508131, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు
ఎస్. అరుణ (ఐడీ: 4508128, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు
కె. వాణి (ఐడీ: 4508129, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు
వై. లక్ష్మి (ఐడీ: 4508127, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు
జె. సుజాత (ఐడీ: 4508130, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2) – 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు
టి. వెంకటాద్రి (ఐడీ: 1829304, ఎం.పి.హెచ్.ఎస్) – 7 సంవత్సరాల 6 నెలల 7 రోజులు
ఎం. శ్రీనివాస రావు (ఐడీ: 2522642, ఎం.పి.హెచ్.ఎ) – 11 సంవత్సరాల 9 నెలలు
జి. భావన (ఐడీ: 4508154, ఫార్మసీ ఆఫీసర్) – 2 సంవత్సరాల 7 నెలల 17 రోజులు
డి. షమిలి (ఐడీ: 4508557, ఫార్మసీ ఆఫీసర్) – 2 సంవత్సరాల 3 నెలల 5 రోజులు
ఎన్. దేవేంద్రకుమారి (ఐడీ: 4508145, ఫార్మసీ ఆఫీసర్) – 2 సంవత్సరాల 7 నెలల 17 రోజులు
పి. లక్ష్మి (ఐడీ: 4507621, రేడియోగ్రాఫర్) – 2 సంవత్సరాల 11 నెలల 7 రోజులు
పి. దేవేందర్ (ఐడీ: 2546184, డ్రైవర్) – 24 సంవత్సరాలు
మహమ్మద్ అబ్దుల్ సామి ఖాన్ (ఐడీ: 2546195, డ్రైవర్) – 19 సంవత్సరాలు
ఆర్. సోమ (ఐడీ: 2545943, సీనియర్ లిఫ్ట్ అటెండెంట్) – 22 సంవత్సరాలు
బి. రవి (ఐడీ: 2558463, సీనియర్ లిఫ్ట్ అటెండెంట్) – 36 సంవత్సరాలు

అడ్మినిస్ట్రేటివ్ మరియు ఇతర విభాగాల సిబ్బంది తీరు:

కేవలం వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లే కాకుండా.. ఈ-2 సెక్షన్‌కు చెందిన ఎన్. శారద (యు.డి. స్టెనో) – 18 సంవత్సరాలు, బి. సదానంద్ (ఎల్.డి. టైపిస్ట్) – 16 సంవత్సరాలు, సి.ఎన్. కల్యాణ్ (సీనియర్ అసిస్టెంట్) – 9 సంవత్సరాలు, బి. శోభ (జూనియర్ అసిస్టెంట్) – 32 సంవత్సరాలు, ఎం. అఖిల (జూనియర్ అసిస్టెంట్) – 28 సంవత్సరాలు, మహమ్మద్ మన్సూరఅహ్మద్ (జూనియర్ అసిస్టెం ట్) – 24 సంవత్సరాలు, ఎ. శివ కుమార్ (టెలిఫోన్ ఆపరేటర్) – 32 సంవత్సరాలు, జాహెద్ హుస్సేన్ (టెలిఫోన్ ఆపరేటర్) – 36 సంవత్సరాలు పాటు ఒకే కార్యాలయంలో కొనసాగుతూ అధికారుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల తీవ్ర ఉల్లంఘన:

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు మరియు సాంకేతిక సిబ్బంది నిర్దిష్ట కాలపరిమితి పూర్తి కాగానే వేరే ప్రాంతాలకు బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే, ఉస్మానియా హాస్పిటల్‌లో కొద్దిమంది పైస్థాయి అధికారుల స్వార్థపూరిత అండదండలు, కుమ్మక్కు రాజకీయాల వల్లే బదిలీల నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి దశాబ్దాల తరబడి తిష్ట వేసినట్లు ఆర్టీఐ ద్వారా అందిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల కిందిస్థాయి నిజాయితీగల సిబ్బందికి రావాల్సిన పదోన్నతులు, బదిలీ అవకాశాలు దక్కకుండా అన్యాయం జరుగుతుండగా.. ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా భ్రష్టుపట్టి పారదర్శకత లోపిస్తోందని రోగులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వ్యవస్థీకృత అక్రమ కొనసాగింపుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తక్షణమే స్పందించి, బాధ్యులపై నిర్దాక్షిణ్యంగా సమగ్ర విచారణ జరపాలి. నిబంధనల కు విరుద్ధంగా ఏళ్ల తరబడి తిష్ట వేసి అక్రమాలకు పాల్పడుతున్న ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఇతర సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News