Homeనల్లగొండYadagirigutta | ప్రారంభమైన పాతగుట్ట బ్రహ్మోత్సవములు

Yadagirigutta | ప్రారంభమైన పాతగుట్ట బ్రహ్మోత్సవములు

  • విశ్వక్సేన ఆరాధన రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభం
  • 28వ తేదీ నుండి వచ్చేనెల 03 వ తేదీ వరకు నిర్వహణ
  • 31వ తేదీ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం,01 వ తేదీ దివ్య విమాన రథోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.అంతకుముందే స్వామివారిని అనేక పూలమాలలతో అలంకరించి,ప్రధానాలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో,పుష్పమాలలతో, సిద్ధం చేసి ఉంచారు ఆలయ అధికారులు.అనంతరం బ్రహ్మోత్సవములను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

Old Yadagirigutta Lakshmi Narasimha Swamy Brahmotsavams Begin

ఆలయ అర్చకులు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 10 గంటలకు స్వస్తివాచనం,విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం,మొదలకు కార్యక్రమాలు నిర్వహించారు.సాయంత్రం 5:00 గంటలకు అంకురారోపణము, మృత్సంగ్రహణం,నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి వినోద్, చైర్మన్ నరసింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు,ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు,డీఈవో దోర్బల భాస్కర్ శర్మ,ఏఈఓ మహేష్,సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, స్థానికులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Old Yadagirigutta Lakshmi Narasimha Swamy Brahmotsavams Begin00
- Advertisement -
RELATED ARTICLES

Latest News