న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Nuclear Power Corporation Of India Limited-NPCIL)లో 114 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్(సివిల్) 2, స్టైపెండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ 12, స్టైపెండరీ ట్రైనీ లేదా టెక్నీషియన్ 83, ఎక్స్ రే టెక్నీషియన్ 2, అసిస్టెంట్ గ్రేడ్ వన్(హెచ్ఆర్) 6, అసిస్టెంట్ గ్రేడ్ వన్(ఎఫ్ అండ్ ఏ) 5, అసిస్టెంట్ గ్రేడ్ వన్(సీ అండ్ ఎంఎం) 4 ఖాళీలు ఉన్నాయి. అర్హులు ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 4లోపు ఆన్‌లైన్‌లో అప్లై(Online Application) చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్(Online Test), పర్సనల్ ఇంటర్వ్యూ(Personal Interview), స్కిల్ టెస్ట్(Skill Test) తదితర దశల్లో వడపోసిన అనంతరం తుది ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.npcilcareers.co.inను సంప్రదించొచ్చు.
NPCIL | ఎన్‌పీసీఐఎల్‌లో 114 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES
