Homeకెరీర్ న్యూస్RRB Jobs | మరో ఛాన్స్..

RRB Jobs | మరో ఛాన్స్..

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు..
  • ఆర్.ఆర్.బీ. గ్రూప్ డీ ఉద్యోగాల ఆన్ లైన్ దరకాస్తు గడువు పొడగింపు..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు సోమవారం (మార్చి 2)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు ఆర్ఆర్‌బీ ఉద్యోగాల దరఖాస్తు గుడువును పొడిగించింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐఐటీ డిప్లొమా అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌లో మొత్తం 1012 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. పరీక్షకు హాజరైతే ఇందులో చాలా వరకు రిఫండ్‌ అవుతుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు గడువు ముగిసేలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ : మార్చి 9, 2026 రాత్రి 11.59 గంటల వరకు
ఫీజు చెల్లింపులకు చివరి తేదీ : మార్చి 11, 2026 రాత్రి 11. 59 గంటల వరకు
దరఖాస్తు సవరణ తేదీలు : మార్చి 12 నుంచి 21వ తేదీ వరకు

- Advertisement -
RELATED ARTICLES

Latest News