Wednesday, March 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBirth Roots Hospital | నో మార్టిగేజ్‌ ? నో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ?

Birth Roots Hospital | నో మార్టిగేజ్‌ ? నో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ?

  • మార్టిగేజ్‌ ఉన్నట్లా ? లేనట్లా?
  • ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేని బర్త్‌ రూట్‌ఆసుపత్రి బిల్డింగ్‌ !
  • ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకున్న ఇంటి నెంబర్‌ !
  • బిల్డింగ్‌ సీజ్‌ ఎప్పుడు ?
  • మున్సిపల్‌ చట్టంపై కమిషనర్‌కి అవగాహన ఉందా ? లేదా ?
  • అక్రమ నిర్మాణం పై కమిషనర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?

మంచిర్యాల బర్త్‌ రూట్‌ మెటర్నిటీ హాస్పిటల్‌ బిల్డింగ్‌ యాజమాని మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి 2019 సంవత్సరంలో స్టిల్ట్‌ మరియు రెసిడెన్షియల్‌ భవన నిర్మాణం కోసం జిం 5 అనుమతి తీసుకోగా, సెకండ్‌ ఫ్లోర్‌ మొత్తం మంచిర్యాల మున్సిపల్‌ పేరున మార్టిగేజ్‌ చేసినట్టు బిల్డింగ్‌ పర్మిషన్‌ కాపీలో నమోదు చేయబడిరది. కానీ ఈ యొక్క పర్మిషన్‌ కాపీలో మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఇవ్వకుండా నోటరీ అఫిడవిట్‌ నెంబర్‌ 64/2019 గా చూపడం జరిగింది. ఈ నెంబర్‌ తో రిజిస్ట్రేషన్‌ శాఖ ఈసీ చెక్‌ చేసినప్పుడు ఈ యొక్క బిల్డింగ్‌ యజమాని పేరు ఈసీలో కనబడలేదు. ఇదే విషయమై టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులను సంప్రదించగా, మాకు తెలియదు, మార్టిగేజ్‌ ఉందని ఒకసారి లేదని ఒకసారి చెప్తూ, పొంతన లేని సమాధానం చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన ఈసీ చెక్‌ చేసినప్పుడు, ఈ బిల్డింగ్‌ యజమాని బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోవడానికి బిల్డింగ్లోని కొంత భాగం బ్యాంకు పేరున మార్ట్గేజ్‌ చేసినట్లు వివరాలు ఉన్నాయి. కానీ మున్సిపాలిటీ పేరున సెకండ్‌ ఫ్లోర్‌ మార్టిగేజ్‌ చేసినట్లు వివరాలు కనిపించకపోవడం గమనార్హం.

అసలు మార్టిగేజ్‌ చేశారా ? లేదా ?

అసలు ఈ బిల్డింగ్‌ లోని రెండవ అంతస్తు మున్సిపాలిటీ పేరున మార్టిగేజ్‌ చేశారా ? లేదా అనేది ? అనేక సందేహాలకు దారితీస్తుంది. ఒకవేళ మార్టిగేజ్‌ చేయకపోతే భవనానికి నిర్మాణా అనుమతులు ఎలా ఇచ్చారనేది ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఒకవేళ మార్టిగేజ్‌ చేసి ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండా ఈ బిల్డింగ్‌ లో హాస్పిటల్‌ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నందుకు మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఈ బిల్డింగ్నీ మున్సిపల్‌ చట్టం ప్రకారం సీజ్‌ చేయాల్సి ఉన్న, ఆసుపత్రి ప్రారంభమై ఆరు నెలలు గడిచినప్పటికీ మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ పట్టించుకోకపోవడం పట్ల, అసలు కమిషనర్‌ కి మున్సిపల్‌ చట్టాల మీద అవగాహన ఉందో ? లేదో ? ఈ బిల్డింగ్‌ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజలలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకున్న ఇంటి నెంబర్‌ ఎలా?

మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాత భవనం నిర్మించుకున్న యాజమాని ఇంటి నెంబర్‌ కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇంటి పట్టా కాపీ, బిల్డింగ్‌ పర్మిషన్‌ కాపీ, బిల్డింగ్‌ ఫోటోలతో పాటు, బిల్డింగ్‌ పరిమాణాన్ని బట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా జతపరిచిన తర్వాతే, మున్సిపల్‌ అధికారులు ఇంటి నెంబరు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బిల్డింగ్‌ యజమాని ఆక్యుపేన్సీ సర్టిఫికేట్‌ తీసుకోనట్లైట్‌ ఆ బిల్డింగ్‌ ని సీజ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి నెంబర్‌ కోసం వచ్చిన దరఖాస్తును మున్సిపల్‌ రెవిన్యూ అధికారులు కమిషనర్‌ కు బదిలీ చేసిన తర్వాత వచ్చిన దరఖాస్తును జతపరిచిన పత్రాలను కమిషనర్‌ చూసుకొని బిల్డింగ్‌ సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేయకుండా ఇంటి నెంబర్‌ జారీ చేయడం గమనార్హం. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇటువంటి నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ని వివరణ కోరగా, మున్సిపల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఇదే వార్తపై మరో కథనంతో మీ ముందుకు….

- Advertisement -
RELATED ARTICLES

Latest News