- జిల్లా సాధనతో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలలో అభివృద్ధి.
- గత అభివృద్ధికి అండగా నిలిచి గులాబీ జెండా రెపరెపలాడించాలి.
- పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారికి ఇకపై పార్టీతో సంబంధం లేదు.
- మున్సిపల్ ఎన్నికల ప్రచార భేరి మోగించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి..
కడుపులో ఉన్న బిడ్డకు కూడా సంక్షేమం అందించిన ఘనత కేసీఆర్ ది అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ బలపరిచిన (5,18,19,20,21) వార్డుల అభ్యర్థులు గోర్ల ప్రేమ్ కుమార్, మదన్, మురళీ సాగర్, సునీల్ వాల్మీకి, పుట్ట ఆంజనేయులు తరపున గాంధీనగర్ వీధిలో “కార్నర్”మీటింగ్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..

పాత పట్టణాన్ని రోడ్ల విస్తరణ, నల్ల చెరువు, మాత శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ వంటి అభివృద్ధి పథకాలు తెచ్చి కొత్త పట్టణానికి ధీటుగా తీర్చిదిద్దాం అని అన్నారు. సౌకర్యాలు పెరగడంతో భూముల విలువలు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఎదిగారని ఇవన్ని ముందు చూపుతో చేశామని.. చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని రెండేండ్లలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని ప్రజల్లో ఆలోచించి అండగా నిలిచి బి.ఆర్.ఎస్ మరియు మిత్ర పక్షాల అభ్యర్థులను గెలిపించి గులాబీ జెండా రెపరెపలాడించాలి అని పిలుపునిచ్చారు.

మహిళలకు 2500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా బరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఆసరా పింఛన్లు, ఆటో కార్మికులకు బకాయిలు చెల్లించలేని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు.

