Homeఆదాబ్ ప్రత్యేకంNarsingi | అనుమతులకు మించి నిర్మాణాలు..

Narsingi | అనుమతులకు మించి నిర్మాణాలు..

  • షోకాజ్ నోటీసులు జారీ అయినా చర్యలు శూన్యం..
  • అధికారుల మౌనంపై స్థానికుల ఆగ్రహం..
  • అక్రమ నిర్మాణానికే ఓసీ జారీ చేసిన హెచ్.ఎం.డి.ఎ
  • అధికారుల పాత్రపై విజిలెన్స్ విచారణకు డిమాండ్
  • సైబరాబాద్‌లో వెలుగు చూసిన భారీ కుంభకోణం..

నార్సింగి సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్.ఎమ్.డి.ఎ.) ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ అంతస్తుల వ్యవ హారం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమాలపై డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుల విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుం డటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రణాళికా విభాగం నిర్లక్ష్యం – అవినీతి కోణం :

గండిపేట గ్రామం, సర్వే నంబర్ 9/1 లోని ప్లాట్ నంబర్లు 1-ఎ, 1-బి, 1-సి లలో వెలసిన భవనం, ప్రణాళికా విభాగం అవినీతికి నిలువుటద్దంగా నిలుస్తోంది. మంజూరైన ప్లాన్ ప్రకారం సెల్లార్ ం గ్రౌండ్ ఫ్లోర్ ం రెండు అంతస్తులకే అనుమతి ఉన్నప్పటికీ, అదనంగా మరో రెండు అంతస్తులను అక్రమంగా నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ భవనానికి హెచ్.ఎమ్.డి.ఎ. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓ.సి.)జారీ చేయడం గమనార్హం.

- Advertisement -

కేవలం 10 శాతం వ్యత్యాసాన్ని చూపి, తప్పుడు పత్రాలను సృష్టించి, అనుమతి పొందిన దానికంటే అదనంగా రెండు అంతస్తులను నిర్మించడం వెనుక ప్రణాళికా విభాగం అధికారుల హస్తం ఉందని స్థానికులు బలంగా ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు భవనాన్ని వాడుతున్నా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు మౌనం వహించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

షోకాజ్ నోటీసు.. కేవలం కాలయాపనకేనా? :

గత జూన్ 25న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసు, ప్రస్తుతానికి కేవలం కాగితాలకే పరిమితమైంది. ఈ నోటీసు ప్రకారం, 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని మరియు జూలై 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నోటీసులో పేర్కొన్న గడువు ముగిసిన ప్పటికీ, సంబంధిత అధికారులు ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టకుండా, అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ప్రారంభి ంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎమ్.సి.) చట్టం 1955 మరియు టి.ఎస్-బి.పాస్ చట్టం 2020 నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినా, నోటీసులు ఇచ్చిన అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఇప్పుడు నార్సింగి సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది.

విజిలెన్స్ విచారణకు డిమాండ్ :

ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరగాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం షోకాజ్ నోటీసులతో కాలయాపన చేయ డం మానుకోవాలని, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ (ఏ.సి.బి.) రంగంలోకి దిగి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేసి, చట్టాన్ని గౌరవించాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News