- వనపర్తి మున్నూరు రవీందర్ పోటీ.
తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికలలో బార్ కౌన్సిల్ సభ్యుడిగా వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీనియర్ మున్నూరు రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడిగా న్యాయవాదుల కర్తవ్యాన్ని .. సంక్షేమం కోసం దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ల కోసం తమను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా తమను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాక న్యాయవాదుల సంక్షేమ కోసం 5 ఎజెండాలతో ముందుకు వచ్చారు. మల్టీ స్పెషల్ హాస్పిటల్, ప్రతి నెల జూనియర్ న్యాయవాదులకు 20 వేలు, 5 సంవత్సరాలకు, ఇళ్ల స్థలాలు, పారదర్శకంగా లెక్కలు,బారు కౌన్సిల్ నుండి 10 లక్షల ఇన్సురెన్స్, అంతేకాక న్యాయం కోసం వస్తున్న దివ్యాంగులు, పేద బడుగు బలహీనవర్గాల తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తిస్తూ బార్ కౌన్సిల్లో న్యాయవాదుల సమస్యలతో పాటు అనేక సమస్యల పైన తన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణలోని యువతి, యువకులకు న్యాయవాద వృత్తిలో మహిళలతో పాటు యువకులకు సమాన అవకాశాలు కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ల సంక్షేమం కోసం తాను కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో జవాబు దారి విధానంలో ఉండే విధంగా పనిచేస్తూ తోటి న్యాయవాదులకు సమాన న్యాయం చేస్తానని వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా తనను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక వనపర్తి బార్ కౌన్సిల్ సభ్యులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీల్లో నిలబెట్టిన వనపర్తి బార్ కౌన్సిల్ సభ్యులకు న్యాయవాదులకు ఇతర తెలంగాణలోని న్యాయవాదులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలిపారు.

