- మేడ్చల్ అస్తిత్వానికి గొడ్డలిపెట్టు
- బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేవలం ఆరు నియోజకవర్గాలు ఉన్నపుడు ముఖ్యమంతిగా ప్రాతినిత్యం వహించడానికి కనిపించిన ఏకైక నియోజకవర్గం మేడ్చల్ అని. మేడిచలిమితో ఎంతోమంది బాటసారులకు దాహం తీర్చిన విధంగా అనేకమంది నేతలకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన మేడ్చల్ ప్రాంతం తన అస్తిత్వాన్ని కోల్పోతున్న సమయంలో అసమర్థులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ నేతలు పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన రామన్న గారి శ్రీనివాస్ గౌడ్,శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూగతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాగా ఉన్నప్పటికీ ఇక్కడ జిల్లా స్థాయి కార్యాలయాల ఏర్పాటు విషయంలో వివక్షతనే ఉంది అన్నారు.
నేడు కొంగుత్తగా కాంగ్రెస్ నేతల అనాలోచిత నిర్ణయం వల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేరు నుండి మేడ్చల్ పేరును తొలగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి అదే సమయంలో మేడ్చల్ పేరుతో డిసిపి పరిధి జోన్ ఉన్నప్పటికీ ఆ యొక్క ఆఫీసు మేడ్చల్ లో ఏర్పాటు కొరకు శంకుస్థాపన జరిగినప్పటికీ మొన్నటి పోలీసు జోన్ల పునర్వ్యవస్థీకరణలో మేడ్చల్ డిసిపి జోన్ తొలగించి కుత్బుల్లాపూర్ ను ఏర్పాటు చేయడం దాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇకనైనా అసమర్థులు మొద్దు నిద్ర వేడి ఈ అంశంపై పోరాటం చేసి మేడ్చల్ ప్రాంత అస్తిత్వాన్ని కొనసాగించే విధంగా చూడాలని పేర్కొన్నారు..
