Thursday, January 15, 2026
EPAPER
Homeఅంతర్జాతీయంSrilanka | 11 మంది భారత జాలర్ల అరెస్ట్

Srilanka | 11 మంది భారత జాలర్ల అరెస్ట్

శ్రీలంక నావికాదళం(Srilanka Navy) 11 మంది భారతీయ మత్స్యకారుల(Indian Firshemen)ను అరెస్టు(Arrest) చేసింది. వారి నుంచి ట్రాలర్‌(Trawler)ను స్వాధీనం చేసుకుంది. తమ జలాల్లో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక నావికాదళం శుక్రవారం తెలిపింది. ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురైకి ఉత్తరాన గురువారం రాత్రి జాలర్లను అరెస్టు చేసినట్లు ఆ దేశ నేవీ ప్రతినిధి కమాండర్ బుద్ధిక సంపత్.. పీటీఐకి చెప్పారు. “వారు ఆ ప్రాంతంలో అక్రమంగా చేపలు పట్టడం(Illegal Fishing) ప్రారంభించారు. వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోలేదు” అని పేర్కొన్నారు.

అరెస్టు తర్వాత తదుపరి చర్య కోసం నిందితులను మైలాడి ఫిషరీస్ ఇన్‌స్పెక్టరేట్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇండియా-శ్రీలంక సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పద అంశంగా ఉంటోంది. ఈ ఘటనలు ఎక్కువగా పాక్ జలసంధిలో జరుగుతాయి. ఇది తమిళనాడు(Tamilnadu)ను శ్రీలంక ఉత్తర కొన నుంచి వేరు చేసే ఇరుకైన జలసంధి. రెండు దేశాల జాలర్లకు మంచి మత్స్యకార ప్రదేశం. శ్రీలంక నేవీ సిబ్బంది కొన్నిసార్లు పాక్ జల సంధిలోని మన దేశ మత్స్యకారులపై కాల్పులు జరిపి, ఆ దేశ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు వారి పడవలను స్వాధీనం చేసుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News