Thursday, January 15, 2026
EPAPER
Homeస్పోర్ట్స్Team India | బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన!

Team India | బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన!

టీమిండియా ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌(Bangladesh)లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆగస్ట్ 28న ఆ దేశానికి చేరుకోనున్న మన జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(Bangladesh Cricket Board) ప్రకటన చేసింది. దీని ప్రకారం 3 వన్డేలు సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో, 3 టీ20లు సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో జరుగుతాయి. అయితే బంగ్లాదేశ్‌లో అస్థిర రాజకీయ, ప్రభుత్వ పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటనకు బీసీసీఐ(BCCI) ఒప్పుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి. ఈ కారణంగానే గతేడాది జులైలో ఇండియా.. బంగ్లాదేశ్‌లో చేయాల్సిన పర్యటన నిరవధికంగా రద్దయింది. 6 మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్(White Ball Series) ఏడాదికి పైగా వాయిదా పడింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News