Friday, May 8, 2026
Homeరంగారెడ్డిMissing | ఇద్దరు చిన్నారులతో యువతి అదృశ్యం

Missing | ఇద్దరు చిన్నారులతో యువతి అదృశ్యం

జవహర్‌నగర్ పరిధిలోని బీజేఆర్ నగర్‌లో నివసించే రొయ్యల మహిమ రాణి అనే యువతి తన ఇద్దరు చిన్నారులతో కలిసి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలి తల్లి రొయ్యల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు రొయ్యల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె పెద్ద కుమార్తె రొయ్యల మహిమ రాణి వయస్సు 25 సంవత్సరాలు.

ఆమె తన కుమార్తె బ్లెస్సీ వయస్సు 5 సంవత్సరాలు, కుమారుడు ప్రేమ్ జోషువా వయస్సు 2 సంవత్సరాలతో కలిసి ఈ నెల 7వ తేదీన ఉదయం సుమారు 11:25 గంటల సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, తెలిసిన ప్రాంతాలు సహా అనేక చోట్ల వెతికినా వారి ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో తెలిపారు. తమ కుమార్తెతో పాటు చిన్నారులను గుర్తించి సురక్షితంగా అప్పగించాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News