ప్రధాని మోదీ(PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి(Aakashavani)లో చేసే ప్రసంగం 130వ ఎపిసోడ్ ఈ రోజు(జనవరి 25న) ప్రసారమైంది. ఇండియన్ ఇండస్ట్రీస్, స్టార్టప్స్ తమ వస్తువుల తయారీలో క్వాలిటీపై ఫోకస్ (Focus On Quality) పెట్టాలని ప్రధాని సూచించారు. మన దేశ సంస్థల ఉత్పత్తులు అత్యున్నత నాణ్యతకు మారుపేరుగా నిలవాలని ఆకాంక్షించారు. వస్తువుల్లో లోటుపాట్లు లేకుండా రూపొందించాలని కోరారు. మేడిన్ ఇండియా ప్రొడక్ట్(Made in India Product) ఏదైనా ‘ది బెస్ట్’గా ఉండాలని అన్నారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటోందని చెప్పారు. ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్న స్టార్టప్‌లతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. మన దేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ఈ ఏడాదిని కుటుంబ సంవత్సరంగా నిర్వహిస్తుండటాన్ని ప్రస్తావించారు.
