Homeరంగారెడ్డిProtest | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

Protest | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

  • మద్దుల శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైన చర్య అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను నిరసిస్తూ(Protest) మంగళవారం గుండ్లపోచంపల్లి డివిజన్‌ కండ్లకోయ గ్రామంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సాక్షిగా కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఒకవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాడులు, మరోవైపు బీసీ మహిళా మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం సీఎం రేవంత్‌రెడ్డి అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. కుటుంబ సభ్యుల పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన ఆయన.. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.(aadabhyderabad.in) కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని, గతంలో ఆయన రాజీనామాలతో ఢిల్లీ పీఠం కదిలి, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ రాజీనామా చేయాలని అడుగుతున్న రేవంత్‌రెడ్డికి కొడంగల్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని మద్దుల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News