- అక్రమంగా కడుతున్న ఇంటికి నోటీసులతో మమా..
- రెండుసార్లు నోటీసులందినా యథేచ్ఛగా కొనసాగింపు..
- చోద్యం చూస్తున్న జీహెచఎంసీ అధికారులు..
అక్రమార్కులు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. నోటీసులు ఇచ్చి చేతులు ముడుచుకుంటున్నారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వందలాది నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు అక్ర మార్కులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మణికొండ మున్సి పాలిటీ పరిధిలోని పుప్పాలగూడ హనుమాన్ గుడి పక్కన ఇంటి నెబర్ 1-95లో అనుమతులు లేకుండా వివాద స్థలంలో గతం లోనే జీప్లస్ టూ భవనం నిర్మించారు.
అంతటితో ఆగకుండా మరో రెండు ఫ్లోర్లను ఆగమేఘాల మీద నిర్మి స్తున్నారు. దీనిపై నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు అందగా 15 రోజుల్లో అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వకుంటే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణం కొనసాగిస్తునే ఉన్నారు. అధికారులు మరోసారి ఫైనల్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. నోటీసు ఇచ్చి 15 రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా నిర్మాణాన్ని పూర్తిచేసి రంగులు కూడా వేసుకున్నారు.

కానీ అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడం మానేశారు. అది అక్రమ నిర్మాణం అని అధారాలున్నా.. అధికారులే రెండుసార్లు నోటీసులు అందించి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. యజమాని, మున్సిపల్ అధికారులు మధ్య ఏమైనా చీకటి ఒప్పందం కుదిరందా? అనే ప్రశ్నలు లేవనెత్తతున్నాయి.

వివాదస్థలంలో ఇంటి నిర్మాణం..
మణికొండ పరిధిలోని పుప్పాలగూడ హనుమాన్ గుడి పక్కన ఉన్న ఇంటినెబర్ 1-95లో ఎలాంటి అనుమతులు లేకుండా జీప్లస్ టూ భవనం నిర్మించారు. మొత్తం సుమారుగా 250 గజాల స్థలంలో 120 గజాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ ఇంటికి పన్ను కూడా 120 గజాలకు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తున్నది. అక్రమ నిర్మాణంపై నార్సింగి సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా గతనెల 16న షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో కేవలం అదనపు అంతస్థును మాత్రమే పేర్కొన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో లేని మిగిలిన 130 గజాల స్థలం గురించి ప్రస్తావించలేదు. 15 రోజుల్లో జీప్లస్ టూ భవనంపై అదనపు అంతస్థు ఎందుకు నిర్మిస్తున్నారు..? అనుమతులు ఉన్నాయా? వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటు రెవెన్యూ రికార్డుల్లో లేని 130 గజాలను దాచిపెట్టి నామమాత్రంగా నోటీసులు ఇచ్చేసి ఇంటి యజమానితో అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఫైనల్ నోటీసులు ఇచ్చి 15 రోజులు దాటినా ఎటువంటి చర్యలు లేకపోవడం అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.
