HomeఫోటోలుInauguration | బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ సెక్షన్ ను ప్రారంభించిన మోనాలిసా

Inauguration | బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ సెక్షన్ ను ప్రారంభించిన మోనాలిసా

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ‘బేల్ ట్రీ హోటల్’ తన సేవలను మరింత విస్తరిస్తూ, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ఘనంగా ప్రముఖ సినీ నటి, ‘కుంభమేళా’ ఫేమ్ మోనాలిసా శనివారం ఉదయం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం మరియు సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి.

Monalisa Inaugurates Bael Tree Hotels Kitchen 1

కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం మోనాలిసా మాట్లాడుతూ.. “బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి” అని కొనియాడారు. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్ లో కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు అక్కడ చేయబోయే వంటకాల గురించి మాట్లాడుతూ షెఫ్‌ల నైపుణ్యాన్ని అభినందించారు.

- Advertisement -
Monalisa Inaugurates Bael Tree Hotels Kitchen 3

ఈ సందర్బంగా.. బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి హోటల్స్ పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, పరమశివునిపై తనకున్న భక్తి గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. “మేము మా హోటల్‌కు ‘బేల్ ట్రీ’ (Bael Tree) అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం శివుడు. బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ‘త్రిదళం త్రిగుణాకారం’ అంటూ మనం పూజించే ఆ బిల్వ దళాల చెట్టు పేరునే మా సంస్థకు పెట్టుకోవడం మాకు గర్వకారణం. శివుడు అన్నదాత కూడా. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆ విశ్వేశ్వరుడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము. మా హోటల్స్ కు వచ్చే ప్రతి కస్టమర్‌కు మేము అందించే భోజనం ఒక ప్రసాదం లాంటిదని, అది వారికి పూర్తి తృప్తిని ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము.

Monalisa Inaugurates Bael Tree Hotels Kitchen 4

ఆ తృప్తిని ఇచ్చే శక్తి ఆ భోలేనాథుడిదే అని నేను నమ్ముతాను. వ్యాపార పరంగా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న బిల్వ వృక్షం పేరును ఎంచుకోవడం వెనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ పేరు విన్నప్పుడల్లా ఆ శివయ్య గుర్తుకు వస్తారు. హోటల్‌కు వచ్చే వారికి కూడా ఆ ప్రశాంతత, పవిత్రత అందాలనేది మా సంకల్పం. ఏ పని మొదలుపెట్టినా ఆ మహాశివుడి అనుమతి, ఆశీస్సులు ఉండాలి. అందుకే ఈ రోజు ఈ కిచెన్ విభాగాన్ని ప్రారంభించే సమయంలో కూడా మేము ఆయన్నే స్మరించుకున్నాము. శివుడికి ప్రియమైన ఈ ‘బేల్ ట్రీ’ పేరుతో మేము అందిస్తున్న ఈ సేవలు అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని చెప్పారు.

రాజారెడ్డి మాటల్లో శివుడి పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం, తన వ్యాపారాన్ని కేవలం లాభాపేక్షతో కాకుండా ఒక ఆధ్యాత్మిక భావనతో జోడించి నిర్వహిస్తున్న తీరు అక్కడి వారిని ఎంతో ఆకట్టుకుంది.

Monalisa Inaugurates Bael Tree Hotels Kitchen

బేల్ ట్రీ హోటల్స్ మరో యజమాని బాపిరెడ్డి మాట్లాడుతూ, కస్టమర్ల ఆరోగ్యానికి, రుచికి పెద్దపీట వేస్తూ ఈ కొత్త కిచెన్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో వంటగదిని పూర్తిగా శానిటైజ్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ తో పాటు కాంటినెంటల్ వంటకాలను అందించడానికి ప్రత్యేక షెఫ్‌లను నియమించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన దినుసులతో ఇంటి రుచిని తలపించేలా వంటలు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Monalisa Inaugurates Bael Tree Hotels Kitchen 2

మోనాలిసాను చూసేందుకు వచ్చినవారిని తనదైన శైలిలో నవ్వుతూ, అందరికీ అభివాదం చేస్తూ ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. కొంతమంది అభిమానులతో సెల్ఫీలు దిగి వారిని ఖుషీ చేశారు. నటి మోనాలిసా రాకతో బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ముగిసింది. నాణ్యమైన ఆహారం, అద్భుతమైన రుచులతో ఈ హోటల్స్ అతి త్వరలోనే నగరంలో హాట్ ఫేవరెట్‌గా మారుతుందని అందరు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News