Homeకరీంనగర్Rescue | ఆ*త్మహ*త్యకు ప్రయత్నించిన యువకుడి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్స్ సిబ్బంది.

Rescue | ఆ*త్మహ*త్యకు ప్రయత్నించిన యువకుడి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్స్ సిబ్బంది.

  • బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆ*త్మహ*త్యకు ప్రయత్నించిన యువకుడిని బ్లూకోట్స్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు(Rescue). కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్‌పోస్ట్ సమీపంలో శంకర్రావుపేట గ్రామానికి చెందిన వంశీ, వయస్సు 23 సంవత్సరాలు, కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆ*త్మహ*త్యకు ప్రయత్నించినట్లు 112 డయల్‌కు సమాచారం అందింది.

సమాచారం అందిన వెంటనే కొడిమ్యాల బ్లూకోట్స్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకుని కాపాడడం తో పాటు పరిస్థితిని గమనించి యువకుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు.

- Advertisement -

విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి, మానవత్వంతో స్పందించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు.బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వేగంగా స్పందించి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడడం అభినందనీయమని కొనియాడారు.అలాగే, ఆ*త్మహ*త్య ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని, జీవితంలో ఎలాంటి కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత ఒత్తిడులు ఎదురైనా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News