జగిత్యాల: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐపీఎస్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజా సమస్యలపై ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.Tribute
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ. వేణుతో పాటు సిబ్బంది పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
