Homeరంగారెడ్డిMedchal | యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు

Medchal | యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు

మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ అసోసియేషన్ అధ్యక్షులుగా జవహర్ నగర్‌కు చెందిన కె కె చారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మల్కాజ్గిరి డివిజన్ ఏసిపి చక్రపాణి, మల్కాజ్గిరి కమిషనరేట్ సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా కె కె చారికి నియామక పత్రాన్ని అందజేశారు.

KK Chari Human Rights Appointment1

అనంతరం సభలో మాట్లాడిన వారు మానవ హక్కుల పరిరక్షణలో సంఘం పాత్ర కీలకమని పేర్కొన్నారు. తన బాధ్యతల స్వీకరణ అనంతరం కె కె చారి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ మానవ హక్కుల రక్షణ కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ చైర్మన్ డి కమలాకర్, మేడ్చల్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ బత్తిని మీనా, తెలంగాణ స్టేట్ మహిళ యూత్ ప్రెసిడెంట్ ఎల్లంకి పూజిత, మేడిపల్లి వైస్ ప్రెసిడెంట్ జంగిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News