Saturday, May 2, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | యాది మార్వకర్రీ.. నేను మీ గీత కార్మికున్ని

Aaj Ki Baath | యాది మార్వకర్రీ.. నేను మీ గీత కార్మికున్ని

అమరికలు ఆడంబరాలు లేని జీవనం నాది నేను మీ గీత కార్మికున్ని.. మోకు, ముస్తాదే నా అలంకరణ తలపాగే నా కిరీటం.. ఆకాశాన్ని అంటివుండే దేవాదారు వృక్షాలలాంటి నా కల్పవల్లి.. తాటి చెట్టుని కాళ్లకు బంధం వేసుకొని, ఒంటికి మోకుతో చుట్టుకొని మొదలు నుండి మొగిలికి అవలీలగా చేరుకొని దేవతలు తాగే సురాపానకానికి భూలోకానికి తెస్తాను.. తాడుకు పోయింది మొదలు ఊపిరితో తిరిగొచ్చే వరకు నా ఇల్లు ఇల్లాలు తాటికమ్మల నీడన తలమునకలై ఎదురు చూస్తారు నేర్సుకొట్టాలి.. కత్తి నూరాలి చిలుము తీయాలి.. కావడి ఎత్తాలి.. అన్నీ విధాలుగా అలిసిన నా గీతకు అడ్డుపడితే ఆ పరమశివుడి అంశతో పుట్టినోళ్లం.. కౌండిన్య మహాముని వారసులం.. కంఠమహేశ్వరుని కత్తులం.. యాది మార్వకర్రీ.. నేను మీ గీత కార్మికున్ని

  • డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News